- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ వివాహం.. ఫొటోస్ వైరల్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వివాహం గురువారం రాత్రి కర్ణాటకలోని కూర్గ్‌లో ఘనంగా జరిగింది.

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరక్ వివాహం గురువారం రాత్రి కర్ణాటకలోని కూర్గ్‌లో ఘనంగా జరిగింది. కూర్గ్‌లోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులైన మిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సినీ సెలబ్రెటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా.. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్‌కు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా.. ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కలిసి నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్... ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రేమించుకున్నారు. తొలిపరిచయంతో స్టార్ట్ అయిన వీరి ప్రేమ.. ఇప్పుడు పెద్దల అంగీకారంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రజెంట్ కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ వివాహ వేడుకల ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇక కిరణ్ అబ్బవరం ప్రస్తుతం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ "క" లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతోంది.






