యాక్షన్‌ సినిమాగా ‘కిల్లర్’ రాబోతుంది..కొత్త తరహా కంటెంట్‌తో వస్తున్నాం: జ్యోతి పూర్వజ్

by Mallepaka Hamsa |

జ్యోతి పూర్వజ్(Jyothi Purvaj), పూర్వజ్, మనీష్ గిలాడ (Manish Gilada)లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘కిల్లర్’(Killer).

యాక్షన్‌ సినిమాగా ‘కిల్లర్’ రాబోతుంది..కొత్త తరహా కంటెంట్‌తో వస్తున్నాం: జ్యోతి పూర్వజ్
X

దిశ, సినిమా: జ్యోతి పూర్వజ్(Jyothi Purvaj), పూర్వజ్, మనీష్ గిలాడ (Manish Gilada)లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘కిల్లర్’(Killer). చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. తాజాగా, మూవీ మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్ పెంచుకునేందుకు ఈ చిత్రం నుంచి ‘ఫైర్ అండ్ ఐస్ సాంగ్’ ను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. నేను డాక్టర్ కావాలనుకున్నాను. కానీ ఆ డ్రీమ్ పక్కనపెట్టి ఐటీ కంపెనీలో వర్క్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సీరియల్స్ చేసి పాపులర్ అయ్యాను.

ఇప్పుడు హీరోయిన్‌గా మీ ముందుకు వస్తున్నాను. ఇవన్నీ నేను లైఫ్‌లో ప్లాన్ చేయలేదు. అలా జరుగుతూ వస్తున్నాయి. యాక్టర్ అయ్యాక మంచి స్టంట్స్‌తో, యాక్షన్ మూవీ ఒకటి చేయాలని ఉండేది. ఆ విషయం పూర్వజ్‌కు చెప్పాను. ఒకవైపు మాస్టర్ పీస్ సినిమా జరుగుతుండగానే ఈ ‘కిల్లర్’ స్క్రిప్ట్ రెడీ చేశాడు. అది చదివాక మనం ఇంత భారీ స్కేల్‌లో సినిమా ఎలా చేయగలం అని అన్నాను. కానీ తనకున్న పరిచయాలతో, స్నేహితులతో చూస్తుండగానే రూపొందించాడు. ఇందులో పూర్వజ్ చెప్పినట్లూ చేస్తూ వెళ్లా. ఒక కొత్త తరహా కంటెంట్‌తో మీ ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చింది.

Next Story