‘కిల్లర్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. తట్టుకోలేని తుఫాను రాబోతుందంటూ ఫైరింగ్ పోస్టర్ రిలీజ్

by Mallepaka Hamsa |

‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న జ్యోతి పుర్వాజ్(Jyoti Purvaj) హీరోయిన్‌గా మారనుంది.

‘కిల్లర్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. తట్టుకోలేని తుఫాను రాబోతుందంటూ ఫైరింగ్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న జ్యోతి పుర్వాజ్(Jyoti Purvaj) హీరోయిన్‌గా మారనుంది. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి డిఫరెంట్ చిత్రాలు తెరకెక్కించిన పుర్వాజ్ (Purvaj)దర్శకత్వంలో రాబోతుంది. ‘కిల్లర్’ (Killer)టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో జ్యోతి, పుర్వాజ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సెన్సేషనల్ సై-ఫై థ్రిల్లర్‌లో విశాల్ రాజ్, గౌతమ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఏయు అండ్ఐ అంగ్ మెర్జ్ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు ప్రజయ్ కామత్, పద్మనాభరెడ్డి. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు చిత్రబృందం. మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసినట్లు తెలుపుతూ.. ఫస్ట్ సింగిల్ ఫైర్ అండ్ ఐస్ నవంబర్ 16న రాబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఇందులో జ్యోతి బ్లాక్ డ్రెస్ ధరించి హాట్ లుక్‌లో కనిపిస్తూ గన్ పట్టుకుని ఉండగా.. చుట్టూరా మంటలు వస్తున్నాయి. ఈ పోస్ట్‌కు ‘‘భారతదేశం మొట్టమొదటి సూపర్ లేడీ.. తీసుకురాబోతున్న తుఫానును మీరు తట్టుకోలేరు’’ అని చెప్పి ప్రేక్షకుల్లో అంచనాలు డబుల్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిలో హీట్ పుట్టిస్తోంది.

Next Story