కిచ్చా సుదీప్ ‘K-47’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. లక్కీ చాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ!

by Mallepaka Hamsa |

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) గత ఏడాది ‘మ్యాక్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కిచ్చా సుదీప్ ‘K-47’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. లక్కీ చాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ!
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) గత ఏడాది ‘మ్యాక్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం కిచ్చా సుదీప్ ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. K-47 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ కార్తికేయ(Vijay Karthikeya) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని సత్య జ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. దీనికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర, దీప్శిఖా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ జులై 9న ప్రారంభం కాగా.. ప్రస్తుతం చెన్నైలో జరుగుతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాలో ఓ యంగ్ బ్యూటీ జాయిన్ అయినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. జెంటిల్‌మన్, గురు శిష్యారు చిత్రాలతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న నిశ్వికా నాయుడు ‘K-47’ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు టాక్. ఇక ఆమె కెరీర్‌లో ఇది పెద్ద ప్రాజెక్ట్ కానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కిచ్చా సుదీప్, విజయ్ కాంబోలో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ కావడం విశేషం. దీంతో అంతా ఈ చిత్రం వీరి కాంబోలో వచ్చిన ‘మ్యాక్స్’ కు సీక్వెల్ అని భావించారు. కానీ ఈ విషయంపై మూవీ టీమ్ ఇప్పటికే స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియుల్లో ‘K-47’ భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story