- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యష్‌తో పాటు ‘టాక్సిక్’ మూవీ టీమ్‌కు షాకిచ్చిన కియారా.. మేకర్స్‌కు తలనొప్పిగా మారిన ఆమె నిర్ణయం!
ఆ సీన్లు అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ బోల్డ్‌గా ఉన్నాయని భావించిన ఆమె, వాటి నిడివిని తగ్గించాలని లేదా వీలైతే పూర్తిగా తొలగించాలని యష్‌ను, దర్శకురాలిని కోరినట్లు సమాచారం.

దిశ, సినిమా: రాకింగ్ స్టార్ యష్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్’ ఇప్పుడు ఒక సరికొత్త వివాదంతో వార్తల్లో నిలిచింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి, కానీ షూటింగ్ పూర్తయిన తర్వాత హీరోయిన్ కియారా అద్వానీ తీసుకున్న ఒక షాకింగ్ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కియారాకు పూర్తి కంఫర్ట్ జోన్ కల్పించి, ఆమెకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా యష్‌తో ఒక బోల్డ్ లవ్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట. షూటింగ్ సమయంలో కియారా కూడా ఎంతో సహకరించి ఆ సన్నివేశాల్లో నటించింది. అయితే, తాజాగా ఆ సన్నివేశాలు స్క్రీన్ మీద ఎలా వచ్చాయో చూసిన కియారా.. ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ సీన్లు అనుకున్నదానికంటే కాస్త ఎక్కువ బోల్డ్‌గా ఉన్నాయని భావించిన ఆమె, వాటి నిడివిని తగ్గించాలని లేదా వీలైతే పూర్తిగా తొలగించాలని యష్‌ను, దర్శకురాలిని కోరినట్లు సమాచారం. ఈ సినిమాకు అవే హైలెట్ కాగా.. చివరి నిమిషంలో కియారా అలా అనడంతో యష్, మూవీ టీమ్ షాకయ్యారట. అయితే మళ్లీ రీషూట్ విషయంలో మూవీ మేకర్స్‌కు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.
కియారా ఇలా చివరి నిమిషంలో యు-టర్న్ తీసుకోవడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె ప్రొఫెషనలిజం గురించి మాట్లాడుతుంటే, మరికొందరు ఒక నటిగా తనకు నచ్చని సన్నివేశాల విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు ఉంటుందని మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత సునీల్ దర్శన్ స్పందిస్తూ.. ఇలాంటివి సినిమా రంగంలో సర్వసాధారణం అని అన్నారు. "నటీమణులు సన్నిహిత సన్నివేశాల విషయంలో కంగారు పడటం సహజమే. గతంలో నా సినిమా ‘అందాజ్’ షూటింగ్ సమయంలో ప్రియాంక చోప్రా కూడా అక్షయ్ కుమార్‌తో ఇంటిమేట్ సీన్స్ చేసేటప్పుడు చాలా ఆందోళన చెందేది. నేను ఆమెకు ధైర్యం చెప్పి ఒప్పించాల్సి వచ్చేది" అని ఆయన గుర్తు చేసుకున్నారు. మరోవైపు, ఈ సినిమా విడుదల తేదీ కూడా సస్పెన్స్‌లో పడింది. మార్చి 19 నుంచి జూన్ 4కి వాయిదా పడిన ఈ చిత్రం, ఇప్పుడు ఆ తేదీకి కూడా రావడం లేదని మేకర్స్ ప్రకటించారు. ఎడిటింగ్ పనులు, ఇలాంటి చిన్న చిన్న మార్పుల వల్లే సినిమా ఆలస్యం అవుతోందని సమాచారం.






