Kiara Advani: ప్రేమ, పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కియారా అద్వానీ

by Javid Pasha |   (  Updated:2022-06-20 13:56:48  IST  )

Kiara Advani Gives Clarity On Love And Marriage| రెండు మూడు సినిమాలతోనే టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ నటి కియారా అద్వానీ. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '#RC15'లో నటిస్తోంది.

Kiara Advani Gives Clarity On Love And Marriage
X

దిశ, సినిమా: Kiara Advani Gives Clarity On Love And Marriage| రెండు మూడు సినిమాలతోనే టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ నటి కియారా అద్వానీ. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '#RC15'లో నటిస్తోంది. అయితే ఇటీవలే కియారా ప్రేమ, పెళ్లి గురించి రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఆమె స్టార్ హీరో సిద్ధార్థ్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉందని, ప్రస్తుతం మాత్రం వీరిద్దరికీ బ్రేకప్ అయిపోయిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఇదే విషయంపై స్పందించిన కియారా.. తనకు ప్రస్తుతం ఇలాంటి వార్తలు పట్టించుకునేంత టైమ్ లేదని, కానీ ఇలాంటి విమర్శలు సృష్టించేవారు ఏం ఆశిస్తారో అర్థంకాదని పేర్కొంది. అలాగే తన పర్సనల్ విషయాల గురించి ఫ్యామిలీ దగ్గర మాత్రమే మాట్లాడతానన్న కియారా.. ప్రస్తుతం నటిగా ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నానని తెలిపింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కియారా కోలీవుడ్‌లో స్టార్ హీరో శివ కార్తికేయన్ సరసన మొదటిసారిగా హీరోయిన్‌గా నటించబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story