- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘టాక్సిక్’ వివాదంపై కియారా అద్వానీ క్లారిటీ.. అదంతా నాన్‌సెన్స్ అంటూ ఫైర్
టాక్సిక్ సినిమాలో నా పాత్ర గురించి లేదా సీన్ల గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ నిరాధారమైన పుకార్లు మాత్రమే

దిశ, సినిమా: కన్నడ స్టార్, రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’. 'కేజీఎఫ్' సిరీస్‌తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యష్ నటిస్తున్న సినిమా కావడంతో, దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఈ చిత్రం జూన్ 4న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈ సినిమా షూటింగ్, స్క్రిప్ట్ విషయంలో గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో యష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, చిత్రంలో తనపై చిత్రీకరించిన కొన్ని బోల్డ్ సీన్ల విషయంలో కియారా అభ్యంతరం వ్యక్తం చేస్తోందని, వాటిని సినిమా నుంచి తొలగించాలని ఆమె మూవీ టీమ్‌ను రిక్వెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. నటించేటప్పుడు బాగానే ఉన్నా, తాను చేసిన సీన్స్ చూసుకున్న తర్వాత ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుందని వార్తలు రావడంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పించారు.
తనపై వస్తున్న ఈ విమర్శలను గమనించిన కియారా అద్వానీ, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ఆ వార్తలన్నీ నాన్‌సెన్స్ అని కొట్టిపారేసింది. "టాక్సిక్ సినిమాలో నా పాత్ర గురించి లేదా సీన్ల గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ నిరాధారమైన పుకార్లు మాత్రమే. స్క్రిప్ట్ విషయంలో కానీ, బోల్డ్ సీన్ల విషయంలో కానీ నేను చిత్ర యూనిట్‌కు ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు. కావాలని ఎవరో తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారు. వాటిని నమ్మకండి" అని ఆమె స్పష్టత ఇచ్చింది. కియారా క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ వివాదానికి తెరపడినట్లయింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో కియారాతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇంతమంది స్టార్స్ ఉండటంతో సినిమాపై హైప్ విపరీతంగా పెరిగింది. పలుమార్లు వాయిదా పడటంతో విడుదల తేదీపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొన్నప్పటికీ, యష్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరోను వెండితెరపై చూసేందుకు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.






