- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
33 ఏళ్ల తర్వాత ‘ఖల్ నాయక్ రిటర్న్స్’.. షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన సంజయ్ దత్
1993లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆ పాత్రతో సంజయ్ మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ ఒరిజినల్ యాక్షన్ స్టార్ సంజయ్ దత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ప్రకటిస్తూ కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీనిస్తున్నారు. తాజాగా ఆయన తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఐకానిక్ హిట్ అయిన ‘ఖల్ నాయక్’ (1993) చిత్రానికి సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాకు ‘ఖల్ నాయక్ రిటర్న్స్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ, ఒక పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. టీజర్‌లో సంజయ్ దత్ మళ్లీ తన పాత ‘బాల్ రామ్ ప్రసాద్ అలియాస్ బల్లు’ పాత్రలో కనిపించారు. నోటిలో సిగరెట్, కళ్లలో అదే తీక్షణతతో అత్యంత మొరటుగా, పవర్‌ఫుల్ అవతారంలో ఆయన కనిపించిన తీరు అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. 1993లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆ పాత్రతో సంజయ్ మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ సీక్వెల్ గురించి సంజయ్ దత్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 1993 బొంబాయి పేలుళ్ల కేసులో తాను జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో, అక్కడ ఉన్న దాదాపు 4,000 మంది తోటి ఖైదీలు ఈ కథను ముందుకు తీసుకెళ్లమని సలహా ఇచ్చారట. వారి మాటలే ఈ సినిమా పట్టాలెక్కడానికి ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. అలాగే, ఒరిజినల్ మూవీ డైరెక్టర్ సుభాష్ ఘై లేకపోతే ఈ ప్రాజెక్ట్ సాధ్యమయ్యేది కాదని, ఆయన కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉంటారని సంజయ్ స్పష్టం చేశారు. సంజయ్ దత్ సొంత బ్యానర్ త్రీ డైమెన్షన్ మోషన్ పిక్చర్స్, అక్ష కాంబోజ్‌కు చెందిన ‘ఆస్పెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్’ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జియో స్టూడియోస్ నుంచి జ్యోతి దేశ్‌పాండే ఈ సినిమాను సమర్పిస్తున్నారు. దశాబ్దాల తర్వాత మళ్లీ ‘బల్లు’ పాత్ర తెరపైకి వస్తుండటంతో బాలీవుడ్ సినీ వర్గాల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నాగార్జున లేకుంటే ఆర్జీవీ కెరీర్ మొదటిరోజే ముగిసేది – జేడీ సంచలన వ్యాఖ్యలు






