యశ్ అభిమానులకు సూపర్ న్యూస్.. కేజీఎఫ్-3 పై క్లారిటీ

by Disha Web Desk 2 |
యశ్ అభిమానులకు సూపర్ న్యూస్.. కేజీఎఫ్-3 పై క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ హీరో యశ్ ప్రధాన పాత్రలో నటించిన కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలు ఎంతపెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలు కన్నడ సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేశాయి. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా విడుద‌లైన ప్రతి భాష‌లో వ‌సూళ్ళ వ‌ర్షాన్ని కురిపించింది. కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించింది.

ఈ బ్లాక్ బస్టర్ సినిమా విడుదలై ఈ రోజుతో ఏడాది పూర్తి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఈ సినిమా సాధించిన ఘన విజయాన్ని గుర్తు చేసింది. “అత్యంత శక్తిమంతుడైన వ్యక్తి నిలబెట్టిన అత్యంత శక్తివంతమైన వాగ్దానం ఈ చిత్రం. ‘KGF2’ మరపురాని పాత్రలు, యాక్షన్‌తో మనల్ని ఓ అద్భుత ప్రయాణంలోకి తీసుకెళ్లింది. ప్రపంచ వ్యాప్త సినిమా రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టించింది” అని రాసుకొచ్చింది. చివర్లో వాగ్దానం నిలనెబెట్టుకుంటున్నామంటూ ‘కేజీఎఫ్’ చాప్టర్-3 గురించి అనౌన్స్ చేశారు. ఈ వీడియో చూసి అభిమానులు ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు.

Next Story

Most Viewed