ఇండస్ట్రీలోని వర్కింగ్ అవర్స్‌పై కీర్తి సంచలన కామెంట్స్.. నిద్రలేకుండా పని చేయాల్సి వస్తుందంటూ

by Mallepaka Hamsa |

ఇండస్ట్రీలో హీరోయిన్ల వర్కింగ్ అవర్స్ పెద్ద చర్చ మొదలైంది. 8 గంటల పనిదినాలు పెట్టాలని గత కొద్ది రోజులుగా దీపికా పదుకొణె (Deepika Padukone)పోరాటం చేస్తోంది.

ఇండస్ట్రీలోని వర్కింగ్ అవర్స్‌పై కీర్తి సంచలన కామెంట్స్.. నిద్రలేకుండా పని చేయాల్సి వస్తుందంటూ
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో హీరోయిన్ల వర్కింగ్ అవర్స్ పెద్ద చర్చ మొదలైంది. 8 గంటల పనిదినాలు పెట్టాలని గత కొద్ది రోజులుగా దీపికా పదుకొణె (Deepika Padukone)పోరాటం చేస్తోంది. ఈ సమయంలోనే ఆమెను దర్శకనిర్మాతలు భారీ ప్రాజెక్ట్స్ నుంచి తొలగించేశారు. దీంతో ఈ చర్చ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ పని గంటల కారణంగానే తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయంపై ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ ఈ విషయంపై స్పందించి దీపికాకు సపోర్ట్‌గా నిలిచారు. తాజాగా, ఈ లిస్ట్‌లోకి కీర్తి సురేష్(Keerthy Suresh)కూడా చేరిపోయింది. ‘రివాల్వర్ రీటా’ప్రమోషన్స్‌లో భాగంగా వర్కింగ్ అవర్స్‌పై స్పందించింది. ‘‘నేను ఏ ఫెడ్యూల్‌కైనా అలవాటు పడగలను. మహానటి సినిమా సమయంలో ఒకే రోజులో మూడు వేర్వేరు షూటింగ్స్‌లో పాల్గొన్నాను.

ఉదయం ఒక సినిమా, మధ్యాహ్నం మరొకటి, సాయంత్రం మూడో చిత్రం.. ఇలా అన్నింటికి న్యాయం చేశాను. కానీ ఇలా ప్రతి నటుడు చేయలేడు. వాళ్ల పరిస్థితులు సామర్థ్యాలు వేరు. 9 గంటలకు షూట్ ఉంటే హీరోయిన్లు మాత్రం 7:30వరకి సెట్లో ఉండాలి. అంటే 5:30కి నిద్ర లేవాల్సి వస్తుంది. సాయంత్రం 6:30 గంటలకి షూట్ అయిపోయినప్పటికీ మేకప్ తీయడం, కాస్ట్యూమ్ మార్చడం, ఇంటికి చేరడం.. ఇవన్నీ కలిపితే రాత్రి 10:30 గంటలకు అవుతుంది. తర్వాత జిమ్‌కు కూడా వెళ్లాలి. ఇలా చూస్తే హీరోయిన్లు రోజులు 6 గంటలు కూడా నిద్రపోరు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకా మా పరిస్థితి ఇలా ఉంటే.. ఇంకా టెక్నీషియన్స్ మాకంటే ముందే వచ్చి చివర్లో ఇంటికి వెళతారు. వారి పని గంటలు మరింత కఠినంగా ఉంటాయి. లైన్‌మ్యాన్‌లకు రోజులు కేవలం 3-4గంటల నిద్రే దొరకుతుంది.

ఈ పరిస్థితిలో మార్పులు వస్తేనే బాగుంటుంది. అందరికీ అనుకూలమైన పనిగంటలను తీసుకురావాలి’’ అని చెప్పింది. కాగా.. కీర్తి సురేష్ ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్‌లో భాగం అయినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ‘బలగం’తో బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే ఇందులో నితిన్ హీరోగా నటిస్తుండగా.. కీర్తిని హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. ఇక ఈ విషయంపై కూడా స్పందించిన ఆమె.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. అలాగే అవన్నీ నమ్మొద్దని అలాంటి ఏమైనా ఉంటే తానే అధికారికంగా ప్రకటిస్తానని స్పష్టం చేసింది. దీంతో పుకార్లకు చెక్ పడినట్లు అయింది.

Next Story