- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Keerthy Suresh: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న కీర్తి సురేష్ మూవీ.. అధికారిక ప్రకటన విడుదల.. ఆసక్తికర పోస్టర్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)గత ఏడాది ‘బేబీ జాన్’చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)గత ఏడాది ‘బేబీ జాన్’చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈక్రమంలోనే ఆమె తన ప్రియుడు ఆంటోని తటిల్‌ను ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరం అవుతుందనే ప్రచారం జరిగింది. ఈక్రమంలోనే కీర్తి సురేష్ ‘రివాల్వర్ రీటా’ సినిమాతో రాబోతున్నట్లు రిలీజ్ డేట్‌ను వెల్లడించింది. ఇక ఇప్పుడు ఆమె తెలుగు ఫేమస్ పద్యాల్లో ‘ఉప్పు కప్పురంబు నొక్కపోలికనుండు’ పద్యాన్ని టైటిల్‌గా పెట్టుకుని ఓ మూవీ చేసింది.
కీర్తి సురేష్, సుహాస్(Suhas) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఉప్పు కప్పురంబు’(UppuKappuRambu) సినిమాను ఐవి శశి(IV Sashi) దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రాన్ని ఎల్లనార్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై రాధికా ఎల్ నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రకటించిన చాలా రోజులే అవుతున్నప్పటికీ థియేటర్స్‌లో రిలీజ్ కాలేదు. తాజాగా, ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్‌గా ఓటీటీ రాబోతున్నట్లు తెలుపుతూ కీర్తి సురేష్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది.
ట్విట్టర్ ద్వారా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. జూలై 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాల, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది. చిట్టి జయపురం గ్రామవాసులు అందించే వినోదాల విందుకు సిద్ధంగా ఉండమని క్యాప్షన్ జత చేసింది. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఇక ఇందులో కీర్తి సురేష్ ఆరెంజ్ కలర్ లంగావోణి ధరించి కళ్లద్దాలు పెట్టుకుని డిఫరెంట్‌లో లుక్‌లో సుహాస్ ఏదో దొంగిలించగా.. అతని వెంట పరుగెత్తుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






