ముఖంపై గాయాలతో కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న వీడియో…

by Disha Web Desk 23 |
ముఖంపై గాయాలతో కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న వీడియో…
X

దిశ, సినిమా: ఫ్లాప్‌లతో కొంచెం స్లో అయిన కీర్తి సురేష్‏.. రీసెంట్‌గా ‘దసరా’ బ్లాక్ బస్టర్‌‏తో ఫుల్ జోష్‌లో ఉంది. నానికి జోడిగా ఊర మాస్ లుక్‌తో వెన్నెల పాత్రలో నటించిన కీర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిరంజీవి చెల్లిగా ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తున్న ఆమె.. కోల్‌కత్తాలో షూటింగ్‌లో పాల్గొంటోంది. ఇక మూవీస్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కీర్తి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్‌స్టాలో కీర్తి షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ముఖమంతా దెబ్బలు, ఎడమ కంటికి గాయమై గుర్తుపట్టలేనంతగా కనిపిస్తుంది. అయితే ఇదంతా కేవలం తాను నటించిన ఓ సినిమా చిత్రీకరణకు సంబంధించిన వీడియో అని తెలిసింది. గతేడాది కీర్తి సురేష్, డైరెక్టర్ సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలలో అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహించిన ‘సాని కాయిదం’ మే 6, 2022న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అయితే ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తయిన సందర్భంగా.. ఆ షూటింగ్‌కు సంబంధించిన వీడియో, ఫోటోస్ షేర్ చేసింది.

Also Read.. బోల్డ్‌గా రెచ్చిపోయి ఆ పార్ట్స్ చూపించేసిన కీర్తి సురేష్.. ఫొటో వైరల్

హన్సిక ఫస్ట్ జాబ్ ఏంటో తెలుసా? నెలకు ఎంత సంపాదించేదంటే..


Next Story