నడిరోడ్డుపై కీర్తి సురేష్‌ మీద దాడిచేసిన తాగుబోతు

by Disha Web Desk 6 |
నడిరోడ్డుపై కీర్తి సురేష్‌ మీద దాడిచేసిన తాగుబోతు
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కవ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. తమిళంలో అరంగేట్రం చేసిన చాలా మంది స్టార్ కిడ్స్ వచ్చినంత వేగంగా ఫేమ్ అందుకోలేకపోయారు. కీర్తి మాత్రం వరుస హిట్లతో దూసుకుపోయింది. స్టార్ ఇమేజ్ అందుకుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టంది.

‘నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో రోడ్డుమధ్యలో నా స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంతలోనే ఓ తాగుబోతు వచ్చి నాపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో ఒక్క నిమిషం ఆగి తన చెంప చెళ్లుమనిపించాను. దీంతో అప్పుడే ఇలాంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు అందరు మెచ్చుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ నటి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.

Next Story