బ్యాడ్‌లక్ అమ్మాయిగా ముద్రవేశారంటున్న కీర్తి సురేశ్..

by Web Desk |
బ్యాడ్‌లక్ అమ్మాయిగా ముద్రవేశారంటున్న కీర్తి సురేశ్..
X

దిశ, సినిమా: మహానటి కీర్తి సురేశ్‌, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'గుడ్‌ లక్‌ సఖి'. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో రైఫిల్‌ షూటర్‌ 'సఖీ' పాత్రలో కీర్తి, కోచ్‌ పాత్రలో జగపతి బాబు కనిపించగా.. 'మన దేశం గర్వపడేలా షూటర్స్‌ని తయారు చేయబోతున్నాను' అని జగ్గూ భాయ్ చెప్పే డైలాగ్‌‌తో ట్రైలర్‌ మొదలవుతోంది. ఇంటి దగ్గరే పిల్లలతో గోళీలాట ఆడుకునే కీర్తి..'అందరూ నన్ను బ్యాడ్‌లక్‌ సఖి అంటుంటారు. మనకి అటాంటి సోది కబుర్లు మీద నమ్మకం లేదు' అంటూ తన గురించి పరియచం చేసుకుంటుంది.

ఇంతలోనే సఖి మంచి షూటర్ అంటూ ఆదిపినిశెట్టి కోచ్‌కు పరిచయం చేయడంతో కథ మొదలవుతోంది. చివరగా ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? షూటింగ్‌లో సక్సెస్ అయిందా లేదా? అనే విషయం తెలియాలంటే జనవరి 28 థియోటర్‌కు వెళ్లాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని దిల్‌ రాజు సమర్పణలో సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించగా నగేష్‌ కునూరు దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.




Next Story

Most Viewed