‘జవాన్’ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కీర్తి సురేశ్ పెళ్లి

by Disha Web Desk |
‘జవాన్’ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కీర్తి సురేశ్ పెళ్లి
X

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ ‘జవాన్’‌కు మ్యూజిక్ కంపోజ్ చేసి నేషనల్ వైడ్ రాక్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనిరుధ్.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. అది కూడా మహానటి కీర్తి సురేశ్‌తో ఏడడుగులు వేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై రీసెంట్‌గా స్పందించిన కీర్తి తండ్రి సురేశ్ కుమార్.. ఇదంతా ఫేక్ అని క్లారిటీ ఇచ్చాడు. గతంలోనూ దుబాయ్ బేస్డ్ బిజినెస్‌మన్‌తో కీర్తి మ్యారేజ్ జరుగుతుందనే న్యూస్ వచ్చిందని.. ఇవన్నీ బేస్ లెస్ అని చెప్పుకొచ్చాడు. ఎవరో కావాలనే ఈ లింక్-అప్ న్యూస్ రాస్తున్నారని తెలిపాడు. ఇక కీర్తి సురేశ్ కూడా అనిరుధ్‌తో పెళ్లి వార్తను ఖండిస్తూ.. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని తెలిపింది.

Next Story

Most Viewed