ఆ పరిస్థితే వస్తే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటా..?? Keerthy Suresh షాకింగ్ కామెంట్స్..!!

by Chukka Sudharani |   (  Updated:2022-12-05 14:24:56  IST  )

'నేను శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ కీర్తి సురేష్. తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది

ఆ పరిస్థితే వస్తే సినిమాలు మానేసి జాబ్ చేసుకుంటా..?? Keerthy Suresh షాకింగ్ కామెంట్స్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: 'నేను శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ కీర్తి సురేష్. తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న కీర్తిపై.. సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిందట. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని నాకు తెలుసు. అంతేకాదు నాతో పాటు నటిస్తున్న హీరోయిన్లు కూడా దీని గురించి చెప్పారని తెలిపింది. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటి వరకు తన దగ్గరకు రాలేదని.. అది మన ప్రవర్తన బట్టి కూడా ఉంటుందేమో అని తెలిపింది. ఒక వేళ నిజంగా తనను ఎవరైనా కమిట్మెంట్ అడిగితే.. సినిమాలు మానేసి ఏదైనా జాబ్ చేసుకుంటానని క్లారిటీ ఇచ్చిందట. అవకాశాలు కోసం కమిట్మెంట్ ఇచ్చే టైప్ తాను కాదని చెప్పిందట కీర్తి. కాగా.. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

READ MORE

Yashoda Movie OTT Release on Amazon Prime from December 9

Next Story