న్యాయం కోసం కోర్టు మెట్లెక్కుతున్న కీర్తి సురేష్.. క్యూరియాసిటీ పెంచుతున్న ‘సత్యవాన్ సావిత్రి’ లుక్

by Mallepaka Hamsa |

ఒక సామాన్య మహిళ చట్టం ముందు నిలబడి తన హక్కుల కోసం చేసే పోరాటమే ఈ సినిమా అని అర్థమవుతోంది.

న్యాయం కోసం కోర్టు మెట్లెక్కుతున్న కీర్తి సురేష్.. క్యూరియాసిటీ పెంచుతున్న ‘సత్యవాన్ సావిత్రి’ లుక్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ‘మహానటి’ కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక సరైన హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పెళ్లయిన తర్వాత కూడా ఏమాత్రం విరామం తీసుకోకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ, తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ ‘సత్యవాన్ సావిత్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జీ స్టూడియోస్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా కీర్తి ఒక విభిన్నమైన పాత్రలో మన ముందుకు రాబోతోంది. విడుదలైన పోస్టర్‌లో కీర్తి సురేష్ లుక్ చాలా కొత్తగా, అర్థవంతంగా ఉంది. కోర్టు వాతావరణంలో లాయర్ల మధ్య నిలబడి ఉన్న కీర్తి.. సాధారణ చుడీదార్ ధరించి, నుదుటిన, పాపిట్లో కుంకుమ బొట్టుతో కనిపిస్తోంది. ఆమె కళ్లలో అమాయకత్వం కనిపిస్తున్నప్పటికీ, ఏదో గట్టి పోరాటం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

"ప్రశాంతమైన ముఖం.. అజేయమైన శక్తి.. ఇప్పుడు అంతా ఆమె వంతు" అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే, ఒక సామాన్య మహిళ చట్టం ముందు నిలబడి తన హక్కుల కోసం చేసే పోరాటమే ఈ సినిమా అని అర్థమవుతోంది. ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే, ఇందులో ప్రముఖ దర్శకుడు మిస్కిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మిస్కిన్ వంటి విలక్షణ నటుడు కనిపించబోతుండటం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ చిత్రానికి ప్రవీణ్, విజయ్ దర్శకత్వం వహిస్తుండగా, అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించే సామ్ సిఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ లుక్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన మేకర్స్, ఈరోజే సాయంత్రం 5 గంటలకు మరో సెకండ్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. గత ఏడాది వచ్చిన ‘రివాల్వర్ రీటా’ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, ఈ ‘సత్యవాన్ సావిత్రి’ కచ్చితంగా కీర్తి సురేష్‌కు మళ్ళీ సక్సెస్‌ను అందిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

Next Story