మల్టీస్టారర్ సినిమాలో చాన్స్ దక్కించుకున్న కీర్తి సురేష్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-24 09:16:13  IST  )

కీర్తి సురేష్ ఖాతాలో మరో భారీ తెలుగు సినిమా వచ్చి చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

మల్టీస్టారర్ సినిమాలో చాన్స్ దక్కించుకున్న కీర్తి సురేష్
X

దిశ, సినిమా: నేషనల్ అవార్డు విన్నర్, ‘మహానటి’ కీర్తి సురేష్ ప్రస్తుతం తన కెరీర్‌లో గోల్డెన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో వరుస హిట్లు కొడుతూనే, బాలీవుడ్‌లో కూడా ‘రఫ్తార్’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ అమ్మడు ఖాతాలో మరో భారీ తెలుగు సినిమా వచ్చి చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల ‘శంకర్ వరప్రసాద్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఇప్పుడు ఒక భారీ మల్టీస్టారర్ కథను సిద్ధం చేశారు. ఇక ఇందులో విక్టరీ వెంకటేష్ నందమూరి కళ్యాణ్ రామ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

అనిల్ రావిపూడి సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాయి, కాబట్టి కీర్తి ఈ సినిమాలో కొత్త మేనరిజమ్స్‌తో అలరించడం ఖాయమని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు షైన్ స్క్రీన్స్ సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పండగ సీజన్‌లో వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను, కళ్యాణ్ రామ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయం అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్,కీర్తి సురేష్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయట.

Next Story