3 ఏళ్లుగా సినిమా లేదు..స్టార్ హీరోయిన్ ప‌రిస్థితి దారుణం !

by velandi.Saikiran |

3 ఏళ్లుగా సినిమా లేదు..స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌ ప‌రిస్థితి దారుణంగా త‌యారు అయిన‌ట్లు ట్రోల్స్ వ‌స్తున్నాయి.

3 ఏళ్లుగా సినిమా లేదు..స్టార్ హీరోయిన్ ప‌రిస్థితి దారుణం !
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంత మంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో కీర్తి సురేష్ ఒకరు. మహానటిగా పేరు తెచ్చుకున్న ఆమె.. ఇండస్ట్రీలో పెద్ద హీరోల సరసన చాలా సినిమాలు చేశారు. ఇప్పటికే మహానటి, దసరా లాంటి విభిన్నమైన కథలతో తెలుగు ప్రేక్షకులను మైమరపించారు కీర్తి సురేష్. అయితే అలాంటి కీర్తి సురేష్ కు ప్రస్తుతం తెలుగులో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి.

కీర్తి సురేష్ కు తెలుగులో తగ్గిన అవకాశాలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ కీర్తి సురేష్ కు అవకాశాలు తగ్గిన సంగతి తెలిసిందే. గడిచిన మూడు సంవత్సరాలలో ఆమె ఒక్క పెద్ద హీరోతో కూడా సినిమా చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో రౌడీ జనార్ధన చేస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మల్టీ స్టారర్ సినిమాలో కూడా ఆమెను తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇందులో వెంకీ మామకు హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఫైన‌ల్ చేశార‌ట‌. అయితే ఇందులో ఒక్క సినిమా హిట్టు కొట్టినా.. కీర్తి సురేష్ కు వరుసగా ఆఫర్లు వస్తాయి. ఒకవేళ ఈ రెండు సినిమాలు డిజాస్టర్ గా మిగిలితే మాత్రం, కీర్తి సురేష్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ రెండు సినిమాలను కీర్తి సురేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. కాగా 2023లో భోళా శంక‌ర్ సినిమాలో చివ‌ర‌గా కీర్తి సురేష్ మెరిసిన సంగ‌తి తెలిసిందే.

Next Story