- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయాల్లోకి టాలీవుడ్ హీరోయిన్ ... ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది హీరోయిన్లు అతి తక్కువ

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొంతమంది హీరోయిన్లు అతి తక్కువ కాలంలోనే సక్సెస్ అయి.. పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ కీర్తి సురేష్ ఒకరు. మహానటి సినిమాతో ఆమె కెరీర్ మొత్తం మారిపోయింది. తెలుగు, తమిళ్ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రాణిస్తున్నారు కీర్తి సురేష్.
నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ... ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. మహానటి సినిమాతో నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నారు కీర్తి సురేష్. ఇక ఇటీవల బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చి... అందర్నీ ఆకట్టుకున్నారు.
అయితే అలాంటి హీరోయిన్ కీర్తి సురేష్.. రాజకీయ అరంగేట్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె తమిళనాడు రాష్ట్రానికి చెందిన హీరో విజయ్ పెట్టిన పార్టీ లోకి వెళ్తారని సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతోంది. త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కంటే ముందు ఆ పార్టీలోకి కీర్తి సురేష్ వెళతారని ప్రచారం సాగుతోంది. లేదా విజయ్ కోసం ప్రచారం అయిన కీర్తి సురేష్ చేస్తారని అంటున్నారు. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






