- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్మాక్ కుంభకోణంలో తన పేరు ఉండంటంపై స్పందించిన కయాదు లోహర్
మద్యం రిటైలర్ టాస్మాక్ కుంభకోణంలో కయాదు(Kayadu Lohar) పేరు కూడా ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్‌గా మారాయి.

దిశ, సినిమా: మద్యం రిటైలర్ టాస్మాక్ కుంభకోణంలో కయాదు(Kayadu Lohar) పేరు కూడా ఉన్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్‌గా మారాయి. తమిళనాడులో టాస్మాక్ కుంభకోణంలో భాగమైన వారు నిర్వహించిన ఓ పార్టీకి కయాదు వెళ్లినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందుకోసం ఆమె రూ. 35 లక్షలు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కయాదు లోహర్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ బాధపడకుండా ముందుకు సాగడం సులభం అని ప్రజలు అనుకుంటారు.
కానీ అది చాలా కష్టం. ఆ వార్తలు చూసి నేనెంతో బాధపడ్డాను. నా కలలను నేరవేర్చుకోవడం కోసం ఇండస్ట్రీలో కష్టపడుతూ ముందుకు సాగుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం బాధించింది. నేను ఈ వ్యాఖ్యలను చూసినప్పుడల్లా, జనాలు నా గురించి మాట్లాడినప్పుడల్లా, దానిని తట్టుకోవడం నా వల్ల కాదు. నాలాంటి కళాకారులపై ప్రజలు సులభంగా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ అది హద్దులు దాటి వెళ్లకూడదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






