Brahmamudi Today Episode: మారడం అంటే ఇదేనా అంటూ రాజ్ పై ఫైర్ అయిన కావ్య?

by Disha Web Desk 10 |
Brahmamudi Today Episode: మారడం అంటే ఇదేనా అంటూ రాజ్ పై ఫైర్ అయిన కావ్య?
X

దిశ,వెబ్ డెస్క్: ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

రాజ్ బాత్ రూమ్‌లోకి వెళ్లి వచ్చేలోపు రాజ్‌కి ఫోన్ వస్తుంది. డిజైన్స్ వాళ్లు కాల్ చేశారనుకొని కావ్య కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడబోతుంది. అప్పుడే బాత్ రూమ్‌లోంచి బయటికి వచ్చిన రాజ్.. కావ్య చేతిల్లోంచి ఫోన్ లాక్కుంటాడు. కొంచమైన బుద్ది ఉందా.. ఎదుటి వాళ్ల పర్మిషన్ లేకుండా వాళ్ల ఫోన్ చూడకూడదని తెలీదా అంటూ కావ్య మీద కోప పడతాడు.

‘అయ్యో నేనేం కావాలని తియ్యలేదు.. మీ ఫోన్ చెక్ చెయ్యాల్సిన అవసరం కూడా నాకు లేదు..’ అంటూ కావ్య చెబుతున్నా వినిపించుకోడు రాజ్. ఫోన్‌లోనే సీతారామయ్య రిపోర్ట్ ఉండటంతో రాజ్ అలా కంగారు తను ఆడే నాటకాన్ని కూడా మరిచిపోయి.. కావ్య మీద కోపం చూపిస్తాడు. దాంతో కావ్య కోపంగా.. ‘మారతాను అన్నది అంతా అబద్దమేనా? కనీసం ఫోన్ చూస్తే తట్టుకోలేని మీరు మీ భార్యకోసం మారడం అనేది నిజమేనా?’ అనేసి కిందకు వెళ్లిపోతుంది. అయితే రాజ్ తల పట్టుకుని.. ‘అయ్యో ఇప్పుడు నన్ను నమ్మదేమో.. కంగారులో నాటకం ఆడాలని మరిచిపోయాను.. ఛా.. ఇప్పుడు ఎలా.. తనని కూల్ చెయ్యాలి’ అనుకుంటూ వెనుకే పరుగుతీస్తాడు.

Next Story

Most Viewed