పెళ్లికి ముందు మానసికంగా కృంగిపోయాను.. కత్రినా కైఫ్

by Dishanational2 |
పెళ్లికి ముందు మానసికంగా కృంగిపోయాను.. కత్రినా కైఫ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ కత్రినా కైఫ్ ఆందోళన, భయాన్ని ఎలా జయించాలో తెలిపింది. 2019లో వచ్చిన 'భారత్' చిత్రం రిలీజ్‌కు ముందు తాను ఈ ప్రాబ్లమ్ ఎదుర్కోవాల్సి వచ్చిందన్న ఆమె.. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పుస్తకాలే సాయం చేశాయని చెప్పింది. అలాగే మనసులో వచ్చే క్లిష్టమైన ఆలోచలు లేదా భావోద్వేగానికి లొంగిపోకూడదనే విషయాన్ని బుక్స్ చదవడం వల్లే అర్థం చేసుకున్నానని వెల్లడించింది. అంతేకాదు అలియా భట్, దీపికా పదుకునేలు డిప్రెషన్‌తో పోరాడిన తీరును ఆదర్శంగా తీసుకున్నానన్న ఆమె.. నిరాశతో కృంగిపోవాల్సిన అవసరంలేదని చెప్తోంది. చివరగా 'ఈ సంక్లిష్టమైన విశ్వం మన వల్ల ముందుకు సాగడం లేదు. దానంతట అదే నడుస్తోంది. కాబట్టి మనం దానిపై విశ్వాసం కలిగి ఉండాలి. మీరు ఒత్తిడిలో కృంగిపోకుండా ఆలోచన, అభిప్రాయాలను నిర్భయంగా బయటపెట్టండి' అంటూ చెప్పుకొచ్చింది కత్రినా.



Next Story

Most Viewed