వెల్‌కమ్ టూ 'ఫోన్ భూత్'.. ట్రైలర్ చూస్తే తడవాల్సిందే

by Disha Web Desk 6 |
వెల్‌కమ్ టూ ఫోన్ భూత్.. ట్రైలర్ చూస్తే తడవాల్సిందే
X

దిశ, సినిమా : కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఫోన్ భూత్'. హర్రర్ అండ్ కామెడీ నేపథ్యంలో గుర్మీత్ సింగ్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. పగ తీర్చుకునేందుకు బయలుదేరిన ఒక మహిళా దెయ్యానికి ఇషాన్, చతుర్వేది కంటపడటంతో మొదలైన ట్రైలర్ ఆసాంతం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా మంత్రగాడిగా కనిపించిన సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్‌ గట్టిగానే భయపెట్టాడు. ఇక కత్రిన రొమాన్స్‌, ఇతర నటీనటుల భయం, కామెడీ చూస్తే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అని తెలిసిపోతోంది. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వాని నిర్మించిన ఈ చిత్రాన్ని మొదటగా అక్టోబర్ 7న విడుదల చేయాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల నవంబర్ 4న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Next Story

Most Viewed