కార్తీ ‘అన్నగారు వస్తారు’ మూవీ రిలీజ్ డేట్ వాయిదా..? ట్వీట్ వైరల్

by I. Sairam |   (  Updated:2025-12-11 08:09:15  IST  )

స్టార్ హీరో కార్తీ(Karthi), యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) జంటగా నటిస్తున్న సినిమా ‘అన్నగారు వస్తారు’(Annagaru Vastharu).

కార్తీ ‘అన్నగారు వస్తారు’ మూవీ రిలీజ్ డేట్ వాయిదా..? ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరో కార్తీ(Karthi), యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) జంటగా నటిస్తున్న సినిమా ‘అన్నగారు వస్తారు’(Annagaru Vastharu). ఈ చిత్రానికి నలన్ కుమార స్వామి(Nalan Kumarasamy) దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 12న తెలుగులో రిలీజ్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్‌గా మారిది.

ఇక పోస్ట్‌లో అన్నగారు వస్తారు మూవీ డిసెంబర్ 12న రిలీజ్ కావడం లేదు. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది అని రాసి ఉంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Next Story