- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్తీ Sardar-2 మూవీలో హీరోయిన్ ఫిక్స్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ, పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ సర్దార్.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ, పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ సర్దార్. ఈ సినిమాకు సీక్వెల్‌గా సర్దార్-2 రాబోతున్న సంగతి తెలిసిందే. మిషన్ కంబోడియా నేపథ్యంలో సాగే సర్దార్-2 మూవీలో ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ విడుదలై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. కానీ కార్తీ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారో బయటకు రాలేదు. ఈ క్రమంలో ఇందులో అషికా రంగనాథ్ నటించబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా, మేకర్స్ సర్దార్-2 మూవీలోని హీరోయిన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ముందుగా వచ్చిన వార్తలే నిజం చేస్తూ అషికా రంగనాథ్ నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు. సర్దార్-2 సెట్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్తూ హాట్ లుక్ రిలీజ్ చేశారు. కాగా, అషికా రంగనాథ్ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ అమ్మడు చిరంజీవి విశ్వంభర మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఇప్పుడు కార్తీ సరసన జత కట్టబోతుండటంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.
- Tags
- Sardar-2






