- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్తీ రెమ్యూనరేషన్ పై ట్రోలింగ్..రూ.23 కోట్లు అవసరమా అంటూ ?
కార్తీకి రూ. 23 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం పై తెలుగు అభిమానులు ఫైర్ అవుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో త్వరలోనే సరికొత్త సినిమా రానున్న సంగతి తెలిసిందే. MEGA 158 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో ప్రారంభం కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభం కాకముందే, ఇందులో తమిళ్ హీరో కార్తీ స్పెషల్ రోల్ లో కనిపిస్తారని అంటున్నారు. ఏకంగా 23 కోట్లు ఇచ్చి, సినిమాలోకి తీసుకుంటున్నారట.
ఈ న్యూస్ రెండు రోజుల నుంచి వైరల్ గా మారింది. అయితే కార్తీకి రూ. 23 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం పై తెలుగు అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమిళ్ ఇండస్ట్రీలో అతనికి రూ. 14 కోట్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వరు. కానీ మీరు తెలుగులోకి తీసుకువచ్చి, రూ.23 కోట్లు ఎందుకు ఇస్తున్నారని నిలదీస్తున్నారు. ఇలా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి, టికెట్ల ధరలను పెంచి, మాపై భారం పెంచుతున్నారని తెలుగు నిర్మాతలపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇదే రోల్ తెలుగులో మరో హీరోకు ఇస్తే సరిపోతుంది కదా అంటూ నిలదీస్తున్నారు. అటు ధనుష్ కు కూడా తెలుగులో ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు ఫాన్స్. క్లిక్






