కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు.. జానీ మాస్టర్‌పై చిన్మయి సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ సింగర్‌గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న చిన్మయి (Chinmayi)డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ చేసింది.

కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు.. జానీ మాస్టర్‌పై చిన్మయి సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సింగర్‌గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న చిన్మయి (Chinmayi)డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ చేసింది. సమంతకు డబ్బింగ్ చెప్పిన ఆమె పలు చిత్రాల్లో తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగు, తమిళంలో పలు పాటలు పాడిన చిన్మయి కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే కోలీవుడ్ నిషేధం విధించింది. మీటూ ఉద్యమం పట్ల చిన్మయి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపడంతో నిషేధం విధించగా.. గత కొద్ది కాలంగా ఫ్రొఫెషనల్ లైఫ్‌కు దూరంగా ఉంటుంది. కానీ పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న చిన్మయి.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, చిన్మయి ఓ ఇద్దరి గురించి సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది.

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, సింగర్ కార్తీక్‌కు అవకాశాలు ఇవ్వడంపై తనదైన స్టైల్లో స్పందించింది. ‘‘జానీ మాస్టర్(Jani Master), సింగర్ కార్తీక్ (Karthik)వంటి వాళ్లకు ఇండస్ట్రీలో మరోసారి అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు తెలపడమే. డబ్బును అధికారాన్ని దుర్వినియోగం చేసే వారి చేతుల్లో పెట్టొద్దు. మనం నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే.. కర్మ అసలు ఎవరినీ వదిలిపెట్టరు’’ అని రాసుకొచ్చింది. కాగా.. ఇటీవల కార్తీక్, జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

జానీ మాస్టర్ జైలు జీవితాన్ని కూడా గడిపారు. అసిసెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆమె తనపై జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టింది. దీంతో జానీ మాస్టర్‌పై కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొద్ది రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం మళ్లీస్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ అయిపోతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ పనుల్లో నిగ్నమైపోయారు. ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలో జరుగుతున్నట్లు సమాచారం.

link

Next Story