- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్‌తో రొమాన్స్ చేయబోతున్న కరీనా కపూర్.. 11ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్!
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటించబోతున్నట్లు సమాచారం.

దిశ, సినిమా: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత వేగంగా సినిమాలు చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన ఆయన, మరో క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. 'ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి వెబ్ సిరీస్‌లతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సల్మాన్ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి వినిపిస్తున్న విశేషాలు సినీ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘హ్యాంకాక్’ తరహాలో ఈ సినిమా ఉండబోతోందట. సూపర్ హీరో ఎలిమెంట్స్‌కు రాజ్ అండ్ డీకే మార్క్ కామెడీని జోడించి ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒక అసాధారణ శక్తి ఉన్న వ్యక్తి సమాజంలో సామాన్యుడిగా ఎలా ఉంటాడు? తన శక్తులతో ఎలాంటి విన్యాసాలు చేస్తాడు? అనే అంశాలను చాలా వినోదాత్మకంగా, కొత్త కోణంలో ఈ సినిమాలో చూపించబోతున్నారట.
తాజాగా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటించబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ గతంలో క్యోంకి, బాడీగార్డ్, బజరంగీ భాయిజాన్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. సుమారు 11ఏళ్ల విరామం తర్వాత ఈ హిట్ జోడీ మళ్ళీ వెండితెరపై సందడి చేయబోతుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ చిత్రాన్ని అతుల్ అగ్రిహోత్రి నిర్మిస్తుండగా, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి కాబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుందట. రాజ్ అండ్ డీకే శైలి మేకింగ్, సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాదే షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ లేదా ఆ తర్వాతి సీజన్‌లో సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






