మై మోస్ట్ ఫేవరేట్ పర్సన్ అతడే.. కరీనా కపూర్

by Chukka Sudharani |   (  Updated:2023-09-27 12:54:15  IST  )

బాలీవుడ్ నటుడు, భర్త సైఫ్ అలీఖాన్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి కరీనా కపూర్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

kareena kapoor
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు, భర్త సైఫ్ అలీఖాన్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి కరీనా కపూర్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇటీవల ఆమె నటించిన ‘జానే జాన్‌’ విజయాన్ని ఆశ్వాదిస్తున్న నటి తాజా ఇంటర్వ్యూలో సైఫ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల ఎక్కువ సినిమాల్లో పనిచేసే ఛాన్స్ మిస్ అవుతున్నట్లు చెప్పింది. ‘సైఫ్ నాకు చాలా విషయాల్లో సెంటిమెంట్‌. ఎల్లప్పుడూ ఒకరినొకరం వదిలి ఉండలేము. ఒకరి చుట్టూ ఒకరం తిరుగుతూనే ఉండాలనుకుంటాను. అదే దాంపత్య జీవితానికి చాలా ముఖ్యం. అంతకంటే రహస్య సూత్రం ఏమీ లేదు. అలాగే ఒకరినొకరు ఇష్టపడాలని ఆయన తరచూ చెబుతాడు. అన్ని విషయాలు మాట్లాడటం, కలిసి సమయం గడపడం, పనులు చేయడం ఆయనకు ఇష్టం. అందుకే ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి. సైఫ్‌తో పనిచేయడం చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఆయన అద్భుతమైన నటుడని నేను వందశాతం భావిస్తున్నా’ అంటూ భర్తపై ప్రశంసలు కురిపించింది.

Read More: ఏ హీరోలకు ఎలాంటి కబుర్లు చెప్తే ఈ స్టార్ డైరెక్టర్‌కు డేట్స్ ఇస్తారో తెలుసా?

Next Story