బిగ్‌బాస్ వల్ల ఇండస్ట్రీకి దూరం అయ్యా.. చాలా నష్టపోయానంటూ కరాటే కళ్యాణి సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-11 13:17:20  IST  )

ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతోంది.

బిగ్‌బాస్ వల్ల  ఇండస్ట్రీకి దూరం అయ్యా.. చాలా నష్టపోయానంటూ కరాటే కళ్యాణి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఎంతోమంది ప్రేక్షకుల ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకోగా.. 9వ సీజన్ కూడా ఫైనల్‌కు వచ్చేసింది. తెలుగులో అతి పెద్ద షోగా రాణిస్తున్న బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా పాల్గొంటూ తమ పాపులారిటీని పెంచుకుంటున్నారు. అంతేకాకుండా సినిమాల్లో అవకాశాలు పొందుతూ సెలబ్రిటీల్లాగా మారుతున్నారు. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే.. స్టార్ హీరోలతో నటించే అవకాశాలు పొందుతున్నారు.

ఈ షో తర్వాత పాపులారిటీ మరింత పెంచుకున్న వారిలో ఎంతో మంది ఉన్నారు. ఇక ఈ షోతో ఫేమ్ తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతో కూడా ఇందులో పాల్గొన్న వారెందరో ఉన్నారు. బయటకు వచ్చాక ఫాలోయింగ్‌తో సొంత బిజినెస్‌లు పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. అలాంటి ఈ షో వల్ల కూడా కొందరు నష్టపోయినట్లు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, నటి కరాటే కళ్యాణి(Karate Kalyani) బిగ్‌బాస్ షో (Bigg Boss show)గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షో కారణంగా తనకు సినిమా అవకాశాలు రావట్లేదని చెప్పింది. ‘‘నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లడం వల్ల జరిగిన లాభం కంటే నష్టమే ఎక్కువ.

అక్కడికి వెళ్లి సంపాదించిన దానికన్నా రెండింతలు నష్టం వచ్చింది. ఆ షో అగ్రిమెంట్ చేయడం వల్ల అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలు లేవు, చాన్సులు లేవు. దానికి ప్రధాన కారణం నేను బిగ్‌బాస్‌కు వెళ్లడమే. ఆ షో వస్తే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కానీ బయటకు వచ్చాక నన్ను పట్టించుకోలేదు. అది చాలా బాధగా అనిపించింది. బిగ్‌బాస్ షో వల్ల నేను ఇండస్ట్రీకి కూడా పూర్తిగా దూరం అవ్వాల్సి వచ్చింది’’ అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అసలు బిగ్‌బాస్ షో వల్ల ఇంత నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు ఎగబడి ఆ షోలోకి వెళ్తున్నారని నెటిజన్లు కరాటే కళ్యాణిపై మండిపడుతున్నారు.

READ MORE .....

ఏడిపించేశావ్ బిగ్ బాస్.. ఒక్క ప్రోమోతో మనసులు గెలిచేసిన ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.


Next Story