మా అమ్మకు లోదుస్తులు కూడా నేనే తీసుకొస్తా.. Karan Johar కామెంట్స్ వైరల్

by Disha Web Desk 6 |
మా అమ్మకు లోదుస్తులు కూడా నేనే తీసుకొస్తా.. Karan Johar కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఆయన్ తెరకెక్కించిన ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ థియేటర్స్‌లో విడుదలై మంచి రెప్సాన్స్‌ను దక్కించుకుంది. ఇందులో రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్ తన వ్యక్తిగత విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ నేను మా అమ్మకు లోదుస్తులు కొనిస్తాను, అదేమి అంత సిగ్గుపడాల్సిన విషయం కాదు. కానీ, నా స్నేహితులు మాత్రం తనకోసం షాపింగ్ చేస్తున్నప్పుడు తెల భయపడిపోతారు. ఎవరికైనా అమ్మాయికి చెప్పి తనతో కొనిపించవచ్చు కదా అని సూచిస్తారు. మా అమ్మ నన్ను తీసుకురమ్మని చెప్పినప్పుడు నేను ఇంకొకరికి అజమాయిషీ చేయడమెందుకు? మా అమ్మకు ఇప్పుడు 81 ఏళ్లు. తనకు ఏది కావాలన్నా నేనే స్వయంగా తీసుకొస్తాను. అది లోదుస్తులే కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ, అందరూ దాన్ని అసౌకర్యంగా ఫీలవుతారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కరణ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read: ఇబిజా బీచ్‌లో Ananya బికినీ అందాలు..

Next Story

Most Viewed