- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెమ్యునరేషన్ తీసుకుంటే సరిపోదు ప్రమోషన్స్ చేయాలి.. హీరోయిన్స్‌కు వార్నింగ్ ఇస్తూ నిర్మాత షాకింగ్ కామెంట్స్
గత కొద్ది కాలంగా జనాలు సినిమాలు చూసేందుకు థియేటర్స్‌కు వెళ్లడం లేదు.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా జనాలు సినిమాలు చూసేందుకు థియేటర్స్‌కు వెళ్లడం లేదు. ఇంట్లోనే ఆన్‌లైన్‌లో లీక్ అయిన సినిమాలు చూడమో లేదా ఓటీటీలో చూడటం వంటివి చేస్తున్నారు. ఇక మూవీ మేకర్స్ జనాలను థియేటర్స్‌లోకి రప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయినప్పటికీ వారి కష్టానికి ఫలితం లభించడం లేదు. ఇక ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స తన సినిమాను జనాలు చూడనందుకు తన చెప్పుతో కొట్టుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) హీరోయిన్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నటీనటులు సినిమాకు సైన్ చేసిన తర్వాత రెమ్యునరేషన్ తీసుకుంటే సరిపోదు.
రిలీజ్ వరకు జరిగే ప్రమోషన్స్‌లోనూ భాధ్యతగా హీరోయిన్లు పాల్గొంటే బాగుంటుంది. కొంతమంది మనం నటించాం.. పారితోషికం తీసుకున్నాము.. ప్రమోషన్స్‌కు అదనపు ప్యాకేజ్ ఉంటే బాగుండు అనుకుంటున్నారు. కానీ అది తప్పు.. నిజమైన ఫ్రొఫెషనలిజం ఇది కాదు. తన సినిమాను విజయవంతం చేయడానికి ప్రతి దాంట్లో భాగస్వామ్యం కావడమే అసలైన నటి లక్షణం. ఉదాహరణకు దీపికా(Deepika), అలియా(Alia Bhatt), కరీనా గర్భిణీ స్థితిలో ఉన్నప్పటికీ ప్రమోషన్స్ కోసం ముందుకొచ్చారు. వారిని చూసి అయినా మిగతా వారు నేర్చుకోండి. ఇక నుంచి అయినా దర్శకనిర్మాతలకు సాయం చేయడం, మూవీ విజయం కోసం కష్టపడటం కోసం సపోర్ట్‌గా ఉండండి’’ అని చెప్పుకొచ్చారు.






