సౌత్ ఇండియన్ సినిమాలపై కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 6 |
సౌత్ ఇండియన్ సినిమాలపై కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహార్ పలు సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే కాఫీ విత్ కరణ్ షోకు యాంకర్‌కు వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఎంతో మందిని గెస్టులుగా పిలిచి ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ సౌత్ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ బ్యాడ్ హీరోయిజం లేదా మితిమీరిన పురుషాధిక్యతతో సినిమాలు చేయడం బాలీవుడ్ స్టైల్ కాదు. మేము సౌత్ మూవీల నుంచి తెచ్చుకున్నాం. కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత అదే టైప్ చిత్రాలను నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ వాటిని కాపీ కొడుతోంది. బాలీవుడ్ రెడీమేడ్ సినిమాలకు పడిపోయిందని అన్నారు. అనంతరం అర్జున్ రెడ్డి కి ఉదాహరణగా తీసుకుని.. మేము పురుషాధిక్యతను, హీరో మెయిన్‌గా ఉండే కథలను సరైన రీతిలో చూపించేందుకు కష్టపడుతున్నాం. సౌత్ వాళ్ళు అందుకు తగిన విధంగా వ్యవహరిస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చింది. కానీ అది మా స్టైల్ కాదు’’ అంటూ కరణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed