- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ర్టీకి ఎంతోమందిని పరిచయం చేసిన కరణ్ జోహార్.. ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా మరో ముగ్గురిని పరిచయం చేశాడు. ఈ మేరకు శశాంక్ కహితన్ దర్శకత్వం వహిస్తున్న 'బేధడక్' సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఆయన.. ఈ చిత్రంతో షనయా కపూర్ హీరోయిన్‌గా ఆరంగేట్రం చేస్తుండగా లక్ష్య, గుర్ఫతేహ్ పిర్జాదా హీరోలుగా పరిచయం కాబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు ఈ మూవీలో ఒక్కొక్కరి లుక్‌ను ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కరణ్.. 'ధర్మ ప్రొడక్షన్స్ కుటుంబంలోకి ముగ్గురు కొత్త సభ్యులను ఆహ్వానిస్తున్నా. లక్ష్య, షనయా కపూర్, గుర్ఫతేహ్‌లు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు' అని వివరించాడు. ఇక ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.






