గుండె పోటుతో కన్నడ దర్శకుడు నితిన్ గోపి కన్నుమూత..

by Disha Web Desk 6 |
గుండె పోటుతో కన్నడ దర్శకుడు నితిన్ గోపి కన్నుమూత..
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు చిన్న వయసులోనే గుండె పోటుతో మృతి చెందుతున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. హార్ట్ స్ట్రోక్ కారణంగా చనిపోయిన సినీ ప్రముఖులు అనేక మంది ఉన్నారు. అయితే అందులోనూ యంగ్ టాలెంటెడ్ యాక్టర్స్ ప్రాణాలు కోల్పోవడం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తాజాగా, కన్నడ దర్శకుడు, నటుడు నితిన్ గోపి ( 39) గుండెపోటుతో మరణించారు. నితిన్ పెళ్లి కాకపోవడంతో తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అయితే శుక్రవారం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇదిలా ఉంటే నితిన్ భక్తి సిరీయల్ హర హార మహాదేవ్ కొన్ని ఎపిసోడ్‌లకు దర్శకత్వం వహించారు. ముత్తినంత హెంతి, కేరళి ద కేసరి, నిశ్శబ్ధ, చిర బాంధవ్య వంటి చిత్రాలలో కూడా ఆయన నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Also Read...

కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ : Jr. NTR ఎమోషనల్ ట్వీట్



Next Story

Most Viewed