చరణ్‌తో ఒక్కసారైనా జత కట్టాలని ఉంది : Kangana Ranaut

by Kodari Anjali |   (  Updated:2023-09-25 11:58:26  IST  )

ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రంలో ‘చంద్రముఖి 2’ ఒకటి.

చరణ్‌తో ఒక్కసారైనా జత కట్టాలని ఉంది : Kangana Ranaut
X

దిశ, సినిమా: ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రంలో ‘చంద్రముఖి 2’ ఒకటి. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కంగనా రనౌత్ చంద్రముఖి పాత్ర పోషించగా.. లారెన్స్, మహిమ నంబియార్ లీడ్‌ రోల్స్‌లో కనిపించారు. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుండగా.. పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది మూవీ టీమ్. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన.. రాజమౌళి, రామ్ చరణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘నేను తెలుగులో ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించడం కంటే ముందు దర్శకుడు పూరి జగన్నాథ్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘పోకిరి’ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. అయితే అదే సమయంలో నేను ‘గ్యాంగ్ స్టర్’ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరక మిస్ చేసుకున్నా. కానీ నాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి సార్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఉంది. అలాగే ఒక్క మూవీలో అయినా రామ్ చరణ్‌తో కలిసి నటించాలని ఉంది’ అంటూ ఈ సందర్భంగా తన మనసులోని మాటను బయట పెట్టింది కంగన.

Next Story