అతనికి ఉత్సాహమొస్తే తట్టుకోలేను.. వారం రోజుల్లోనే అన్నీ కానిచ్చేస్తాడు.. Kangana Ranaut

by Disha Web Desk 10 |
అతనికి ఉత్సాహమొస్తే తట్టుకోలేను.. వారం రోజుల్లోనే అన్నీ కానిచ్చేస్తాడు.. Kangana Ranaut
X

దిశ, సినిమా : ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ రీసెంట్‌గా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అప్‌కమింగ్ మూవీ ‘ఎమర్జెన్సీ’ గురించి మాట్లాడాడు. సినిమాల్లో ఎలాంటి పొలిటికల్ ఇన్సిడెంట్ చూడాలనుకుంటున్నారనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఎమర్జెన్సీ’ గురించి ప్రస్తావించారు. ఆ సినిమా చూసేందుకు ఎగ్జైటెడ్‌గా ఉన్నట్లు వెల్లడించాడు. అయితే కరణ్ ప్రకటనపై తాజాగా స్పందించింది కంగన. ‘చివరిసారి, అతను ‘మణికర్ణిక’ మూవీ విషయంలో ఇలాంటి ఎగ్జైట్‌మెంట్ ప్రదర్శించాడు. కానీ ఆ మూవీ విడుదలైన వారాంతంలో నాపై జీవితంలోనే అత్యంత చెత్త ప్రచారం చేశారు. ఆ సినిమాకు పనిచేసిన ప్రధాన నటీనటులు సైతం నాపై బురదజల్లారు. మొత్తంగా ఆ మూవీని నాశనం చేసేందుకు వారందరికీ డబ్బులు అందాయి. అలా సక్సెస్‌ఫుల్ వీకెండ్‌ కాస్తా నాకు సజీవ పీడకలగా మారిపోయింది. ఇప్పుడు కరణ్ మళ్లీ ఎగ్జైటెడ్‌గా ఉన్నానంటే.. నాకు భయమేస్తోంది’ అని ట్వీట్ చేసింది. ఇక ‘ఎమర్జెన్సీ’ చిత్రం నవంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా.. కంగన ఇందులో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించింది.

ఇవి కూడా చదవండి :

ఇద్దరు భార్యల ముద్దుల హీరో.. ముగ్గురు కలిసే అలా చేశారు..

బాలీవుడ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న ‘Gadar 2’

Next Story

Most Viewed