Oppenheimer : సెక్స్ సీన్ నాకు బాగా నచ్చింది.. ఉద్వేగానికి లోనయ్యా: Kangana Ranaut

by Phanindra |   (  Updated:2023-07-31 12:58:08  IST  )

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ‘ఒపెన్‌హైమర్‌’ మూవీలో భగవద్గీతతో కూడిన వివాదాస్పద సెక్స్ సన్నివేశంపై తన అభిప్రాయాలు వెల్లడించింది.

Oppenheimer : సెక్స్ సీన్ నాకు బాగా నచ్చింది.. ఉద్వేగానికి లోనయ్యా: Kangana Ranaut
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ‘ఒపెన్‌హైమర్‌’ మూవీలో భగవద్గీతతో కూడిన వివాదాస్పద సెక్స్ సన్నివేశంపై తన అభిప్రాయాలు వెల్లడించింది. ఈ మేరకు సినిమాపై పాజిటీవ్‌గా రియాక్ట్ అయిన నటి.. సినిమాలోని తనకు ఇష్టమైన సన్నివేశాన్ని వెల్లడిస్తూ నెట్టింట వీడియో షేర్ చేసింది. ‘ప్రతిఒక్కరికీ భక్తిని ప్రదర్శించడానికి సొంత మార్గం ఉంటుంది. హీరో యూదు వ్యక్తి అయినందున హిందూ దేవుళ్లను తన మతపరంగా చూడలేడు. ఇంగ్లీష్ సినిమాలో నాకు ఇష్టమైన భగవద్గీత, శ్రీవిష్ణువు చూపించినందుకు క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటివరకు చేసిన అత్యుత్తమ పని ఇదే. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మూవీ వివాదంతో ముగియాలని కోరుకోలేదు. నేను గాఢంగా ఇష్టపడే ప్రతిదీ ఇందులో ఉంది. నేను భౌతికశాస్త్రం, రాజకీయాలపై మక్కువ కలిగి ఉన్నాను. నాకు ఇదొక సినిమా ఉద్వేగం లాంటిది. మన కాలానికి అతి ముఖ్యమైన సినిమా. అద్భుతమైనది’ అంటూ పొగిడేసింది. చివరగా ప్రస్తుతం జాతీయతకు బదులుగా జాతీయవాదం పెరుగుతుందనే విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అంటూ ముగించింది.

Kangana Ranaut Instagram video about Oppenheimer movie

Also Read: ఇండస్ట్రీలో ఎదగాలంటే వాళ్లతో డేటింగ్ చేయాలని చెప్పారు.. Nora Fatehi

Next Story