అందరీ కెరీర్‌లు నాశనం చేయడమే అతని పని.. నిర్మాతపై నటి ఫైర్

by Disha Web Desk 23 |
అందరీ కెరీర్‌లు నాశనం చేయడమే అతని పని.. నిర్మాతపై నటి ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌పై నటి కంగనా రనౌత్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ సమావేశంలో అనుష్క శర్మ కెరీర్ గురించి కరణ్ మాట్లాడిన తీరు చర్చనీయాంశమైంది. దీంతో తాజాగా స్పందించిన కంగనా ‘ఈ పెద్ద మనిషికి ఇదే పని. అందరి కెరీర్‌లు నాశనం చేయడమే అతని పని. అతనికున్న ఏకైక పని కూడా అదే’ అంటూ ఫైర్ అయింది. ఇక ‘రబ్‌ నే బనాది జోడి’ సినిమాకు అనుష్కను తీసుకుందామని ఆదిత్య చోప్రా ఫోటో చూపించాడని, కానీ ఆమెను తీసుకోవద్దని ఆదిత్యతో చెప్పినట్లు కరణ్ ఒప్పుకున్నాడు. అంతేకాదు ‘నీకేమైనా మెంటలా? ఆమెను ఎందుకు సెలక్ట్ చేశావ్‌ అంటూ అరిచాను. అనుష్కను తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశా, కానీ ఆమె నటన చూసి ఆశ్చర్యపోయా, ప్రతిభ ఉన్న అమ్మాయిని తీసుకోవద్దని ఎందుకు చెప్పానా? అని గిల్టీగా ఫీల్ అయ్యాను. సినిమా చూసి అనుష్కకు ఫోన్‌ చేసి ప్రశంసిస్తూ.. సారీ కూడా చెప్పా’ అని కరణ్ ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి: అఖిల్‌ బర్త్ డే.. సమంత స్పెషల్ విషెస్



Next Story

Most Viewed