'Kantara' సినిమాపై ప్రశంసలు కురిపించిన కమల్ హాసన్ (వీడియో)

by Disha Web Desk 6 |
Kantara సినిమాపై ప్రశంసలు కురిపించిన కమల్ హాసన్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటిస్తూ తెరకెక్కించిన చిత్రం 'కాంతార'. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో, అక్టోబర్ 15న న మిగతా బాషల్లో విడుదలై భారీ కలెక్షన్లతో బాక్స్ అఫీసును బద్దలు కొట్టింది. అన్ని బాషల్లో కలిపి రూ. 450 కోట్లకు పైగా కలెక్షన్లు వసూల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇటీవల ఓటీటీలో రిలీజ్ కావడంతో కాంతారను చూసిన పలువురు సినీ ప్రముఖులు ప్రభాస్, ధనుష్, అనుష్క శెట్టి, సిద్ధాంత్ చతుర్వేది, శిల్పా శెట్టి, రజనీ కాంత్, రిషబ్ శెట్టి నటనను ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా, స్టార్ హీరో కమల్ హాసన్ కాంతార సినిమా చూశాడు. ఫిల్మ్ కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాంతారపై ఇట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "కాంతారా ఒక గొప్ప ఉదాహరణ. నేను కూడా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన వాడిని కాబట్టి సంతోషంగా ఉన్నాను. చాలా మంది విభిన్నంగా ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను. ఆ రోజులు తిరిగి వస్తున్నాయి, అదే నాకు అనిపిస్తుంది. 2022లో నా మనసును దోచుకున్న చిత్రం కాంతార అని కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కమల్ హాసన్ వీడియోను షేర్ చేస్తూ థాంక్యూ చెప్పాడు.



Next Story

Most Viewed