‘బ్యూటీ విత్ బ్రెయిన్’.. కీర్తిపై కమల్ హాసన్ ప్రశంసలు

by Disha Web Desk |
‘బ్యూటీ విత్ బ్రెయిన్’.. కీర్తిపై కమల్ హాసన్ ప్రశంసలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. ఇందులో తమిళ్ ‘మామన్నన్’ మూవీ కూడా ఒకటి. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తమిళ్ సినీ ప్రముఖుల్లో ఒకరైన కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ కీర్తి సురేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మామన్నన్‌’ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. కీర్తి గొప్ప నటి. ఆమె ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అని ప్రశంసించాడు కమల్ హాసన్.

Also Read: ఈ సినిమా నన్ను ఏడిపించింది.. ఒత్తిడికి గురి చేసింది

నా జీవితంలో మరపురాని క్షణం అది.. బుట్టబొమ్మ



Next Story

Most Viewed