Kamal Haasan: గుండె పగిలిపోయిందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్.. దేని గురించంటే?

by Mallepaka Hamsa |

ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్సీబీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Kamal Haasan: గుండె పగిలిపోయిందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్.. దేని గురించంటే?
X

దిశ, సినిమా: ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్సీబీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే వారు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన పరేడ్‌‌లో విషాదం చోటుచేసుకుంది. స్టేడియం బయట భారీగా ఫ్యాన్స్ చేరడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించిన విషయం తెలిసిందే. అలాగే పలువురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా, ఈ విషయంపై కోలీవుడ్ స్టా్ర్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘బెంగళూరులో జరిగిన విషాదం గురించి తెలిసాక నా గుండె పగిలిపోయింది. తీవ్ర బాధలో ఉన్నాను. ఈ దుఃఖ సమయంలో బాధితుల కుటుంబాలకు నా హృదయం సానుభూతి తెలియజేస్తోంది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు. కాగా, గత కొద్ది రోజులుగా కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు.

కన్నడ భాషపై పలు వ్యాఖ్యలు చేయడంతో కన్నడిగులు ఫుల్ ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ఆయన నటిస్తున్న ‘థగ్‌లైఫ్’ను కన్నడలో విడుదల కాకుండా కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ కమల్ హాసన్ క్షమాపణలు చెప్పలేరు. తను తప్పుగా మాట్లాడలేదని వాదిస్తున్నారు. ఈ వివాదంపై ఆయన కోర్టులోనూ పిటిషన్ వేశారు. అయినప్పటికీ ఏం చేయలేకపోయారు. ఏం జరిగినప్పటికీ తాను తప్పు చేయలేదని క్షమాపణలు అస్సలే చెప్పను అని భీష్మించుకు కూర్చున్నారు. అయితే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘థగ్‌లైఫ్’ సినిమాలో త్రిష(trisha) హీరోయిన్‌గా నటించింది. అలాగే అభిరామి,ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi), శింబు కీలక పాత్రలో కనిపించారు. అయితేఈ మూవీ జూన్ 5న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది.

Next Story