- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిగ్గజ దర్శకుడి సినిమాలో చాన్స్ కొట్టేసిన కామాక్షి.. చిన్నప్పటి కల నెరవేరిందంటూ ఎమోషనల్ పోస్ట్
నా తదుపరి చిత్రం ‘అగధ’ . కొన్ని కలలు కేవలం నెరవేరడమే కాదు, అవి మనల్ని వినయవంతులుగా చేస్తాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నటి కామాక్షి భాస్కర్ల ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలకమైన మైలురాయిని చేరుకుంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన దిగ్గజ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ‘అగధ’ చిత్రంలో ఆమె ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా విశేషాలను పంచుకుంటూ కామాక్షి పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. చిన్నప్పటి నుండి ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి క్లాసిక్ సినిమాలను చూస్తూ పెరిగిన కామాక్షి, ఇప్పుడు అదే సినిమాల వెనుక ఉన్న దార్శనికుడు ఎం.ఎస్. రాజు గారి ప్రాజెక్ట్‌తో నటించడం పట్ల తన ఆనందాన్ని పంచుకుంది. "నా తదుపరి చిత్రం ‘అగధ’ . కొన్ని కలలు కేవలం నెరవేరడమే కాదు, అవి మనల్ని వినయవంతులుగా చేస్తాయి.
నిర్మాత-దర్శకుడు, దిగ్గజ ఎం.ఎస్. రాజు గారి మాయాజాలాన్ని కొన్ని సినిమాల ద్వారా చూశాను. ఆయన కేవలం ఒక చిత్రనిర్మాత మాత్రమే కాదు, మా అందరికీ కథ చెప్పడంలో ఒక పాఠశాల వంటివారు. ఈ రోజు ఆయన తదుపరి చిత్రం పోస్టర్‌ను పంచుకోవడం, ఈ ప్రయాణంలో ఒక చిన్న భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. టాలీవుడ్‌కు రూపునిచ్చిన ఒక దిగ్గజం పక్కన నిలబడటం ఒక అద్భుతమైన, భావోద్వేగమైన, ఒక పెద్ద బాధ్యతగా అనిపిస్తోంది. చిన్నప్పటి కల నెరవేరినట్లుగా అనిపిస్తోంది" అని రాసుకొచ్చింది. కాగా.. ఒక మిస్టికల్ డివైన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘అగధ’లో కామాక్షి పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. 85 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో సుమారు 45 నిమిషాల పాటు భారీ వీఎఫ్ఎక్స్ (VFX) సీన్స్ ఉండబోతున్నాయని టాక్.
ఇక విడుదలైన పోస్టర్ విషయానికొస్తే.. 12 చేతులున్న భారీ విగ్రహం ముందు నిలబడి ఉన్న ఆ అమ్మాయి పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుందని సమాచారం. కామాక్షి తన నటనతో ఈ మిస్టికల్ థ్రిల్లర్‌ను ఏ రేంజ్‌కు తీసుకెళ్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎం.ఎస్. రాజు గారు ఈ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారట. దీనివల్ల కామాక్షికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న ఈ చిత్రం ద్వారా కామాక్షి భాస్కర్ల తన కెరీర్‌లో మరో బిగ్ హిట్ అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.






