- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిస్ ఇండియా పోటీ పెద్ద మాఫియా .. షాకింగ్ కామెంట్స్ చేసిన కామాక్షి భాస్కర్ల

దిశ, సినిమా: చేసింది తక్కువ ఒక సినిమాలైన కొంత మంది హీరోయిన్లు మంచి ఫేమ్ అందుకుంటారు. అలాంటి హీరోయిన్స్ లలో కామాక్షి భాస్కర్ల ఒకరు. తాజాగా వచ్చిన ‘మా ఊరి పొలిమేర1, 2’ సినిమా లో నటించి భారీగా పాపులారిటీని సంపాదించుకుంది . దీంతో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు అందుకుంటుంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది వైరల్ కామెంట్స్ చేసింది.. ‘ఎంబీబీఎస్ చేసి అపోలో ఆస్పత్రిలో కొంతకాలం డాక్టర్ గా పనిచేశాను. ఆ తర్వాత మోడల్ రంగంలో అడుగుపెట్టి 2018 ఏడాదికి గాను మిస్ తెలంగాణ గా ఎంపికాయ్యాను. 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్ వరకు చేరుకున్న. నేను మోడల్ గా చేస్తానని చెప్తే మా నాన్న డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పాడు. ఇంత కష్టపడి చదివి వేరే ఉద్యోగం చేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. అందుకే సాయంత్రం ఉద్యోగం చేస్తూనే మోడలింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అలా ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడేదాని. అయితే అంతా కష్టపడి నేను మిస్ ఇండియా ఫైనల్స్ కు చేరుకోగా టాప్ 3లో నిలిచాను. అయితే టాప్ 1లోకి వచ్చేందుకు ఇంకా సన్నబడాలని, ఇతర దేశాల వాళ్లతో నా బాడీ మ్యాచ్ కాదని ఒక జడ్డి చెప్పింది. ఆమె అలా చెప్పిన విధానం నాకు నచ్చలేదు. ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నిజం చెప్పాలి అంటే మిస్ ఇండియా పోటీ పెద్ద మాఫియా. బ్యూటీ అంటే మనలోని అందాన్ని మెరుగు పరిచి చూపించాలి తప్ప. ఏవేవో సర్జరీలు, హెల్త్ పాడు చేసుకోవడం వంటివి నాకు నచ్చలేదు’ అని చెప్పుకొచ్చింది మీనాక్షి. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు వైరల్ అవుతున్నాయి.
- Tags
- Kamakshi Bhaskar






