ఓటీటీలోకి రాబోతున్న కళ్యాణి ప్రియదర్శన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్‌పై ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |

మలయాళ యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది.

ఓటీటీలోకి రాబోతున్న కళ్యాణి ప్రియదర్శన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్‌పై ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: మలయాళ యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ఫుల్ ఫామ్‌లో ఉంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ బాక్సాఫీసు వద్ద సంచనలం సృష్టిస్తోంది. ఇటీవల ‘లోకా’ మూవీతో సూపర్ హీరోగా ఊహించని ఫేమ్ సంపాదించుకుంది. ఈక్రమంలోనే.. ఆమె ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil)సరసన మలయాళంలో నటించిన మూవీ సైతం విడుదల కావడం విశేషం. ఒకరోజు గ్యాప్‌లోనే ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అల్తాఫ్ సలీం దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం ‘ఓడుం కుతిర చాదుం కుతిర’(Odum kutira chadum kutira).

ఈ సినిమాను ఆషిక్ ఉస్మాన్ నిర్మించగా.. ఇందులో రేవతి పిళ్లై కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రం ఆగస్టు 29 విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక నెల రోజులకే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు ప్రముఖ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 26 నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ఇక అది చూసిన నెటిజన్లు ‘లోకా’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Next Story