నీ తప్పు అస్సలు లేదు.. తప్పు అంతా నాదే.. శ్రీజ మాజీ భర్త కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్

by Dishafeatures3 |
నీ తప్పు అస్సలు లేదు.. తప్పు అంతా నాదే.. శ్రీజ మాజీ భర్త కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు మొదటి ప్రేమ పెళ్లి మూన్నాళ్ల ముచ్చటే అయింది. ఇక తల్లిదండ్రులు చేసిన రెండో పెళ్లిది కూడా అదే కథ. కానీ సెకండ్ హస్బెండ్ హీరో కళ్యాణ్ దేవ్ కావడంతో కాస్త అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఆయన బాధతో పెట్టే పోస్టులకు వెంటనే స్పందన వస్తుంది. ఇక వీరికి ఒక పాప కూడా కావడంతో ఆమెను మిస్ అవుతూ స్టోరీస్ షేర్ చేస్తూ బాధాడుతుంటాడు. ఈ క్రమంలోనే ఓ రీల్ షేర్ చేయగా.. దీన్ని ఆయన వివాహం, విడాకులకు లింక్ చేసుకునేలా ఉంది.

కాగా ఈ వీడియోలో రౌండ్ వీల్, స్క్వేర్ వీల్ ఉండగా.. చతురస్రాకారంలో ఉన్న చక్రానిది తప్పు లేదు. దానికి అనుగుణంగా ఉండే రోడ్ కావాలి అంతే అనే అర్థం వచ్చేలా ఉంది. కాగా ఈ పోస్ట్ షేర్ చేసిన ఆయనకు నిజంగానే సరైన ప్లేస్ దొరకలేదని అంటున్నారు నెటిజన్లు. 'ఇందులో శ్రీజ తప్పు లేదు.. తప్పంతా తనదే.. రాంగ్ రోడ్డుపై పరుగెత్తాడు' అని ఇంకొందరు వివరిస్తున్నారు.

ఇక కళ్యాణ్ దేవ్ శ్రీజ భర్తగా ఉన్నప్పుడే రెండు మూడు సినిమాలు హీరోగా చేశాడు. కానీ విడాకుల తర్వాత మెగా ఫ్యామిలీ మద్దతు లేక పోవడంతో ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు కరువయ్యాయి. ప్రస్తుతం బిజినెస్ మీద దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఇక శ్రీజ కూడా వ్యాపారంలో ఒక్కో మెట్టు ఎక్కుతుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed