సాయి పల్లవి కారణంగా ‘కల్కి-2’ షూటింగ్‌కు బ్రేక్.. అసలేం జరిగిందంటే?

by Mallepaka Hamsa |

కల్కి మొదటి భాగంలో సాయి పల్లవి కనిపించలేదు, కానీ రెండో భాగంలో ఆమె ఒక పవర్‌ఫుల్ రోల్ చేస్తోందన్న వార్త ఇప్పటికే ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది.

సాయి పల్లవి కారణంగా ‘కల్కి-2’ షూటింగ్‌కు బ్రేక్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తున్న భారీ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ సీక్వెల్ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించడంతో, దర్శకుడు నాగ్ అశ్విన్ రెండో భాగాన్ని ‘కల్కి-2’ మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, షూటింగ్ సెట్స్ నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన నైట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైనట్లు టాక్. ఇందులో ప్రభాస్‌తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు పాల్గొంటున్నారట. అయితే, అనుకోని కారణాల వల్ల ఈ షెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సమాచారం. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న టాలెంటెడ్ నటి సాయి పల్లవి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవ్వడమే దీనికి కారణమని తెలుస్తోంది.

కల్కి మొదటి భాగంలో సాయి పల్లవి కనిపించలేదు, కానీ రెండో భాగంలో ఆమె ఒక పవర్‌ఫుల్ రోల్ చేస్తోందన్న వార్త ఇప్పటికే ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో, చిత్ర యూనిట్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిందని టాక్. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ షూటింగ్‌ను రీస్టార్ట్ చేయాలని నాగ్ అశ్విన్ నిర్ణయించుకున్నారట. ఈ వార్త తెలిసిన సాయి పల్లవి అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం కేవలం కల్కి సినిమాతోనే కాకుండా వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధం నేపథ్యంలో సాగే ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్’ చిత్రాలు లైన్లో ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్, పురాణాల కలయిలో రాబోతున్న ‘కల్కి-2’ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ చిత్రంతో ప్రభాస్ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story