హాట్ టాపిక్‌గా మారిన కాజోల్ వీడియో.. బాడీ షేమింగ్ చేయడానికి మీకెంత ధైర్యమంటూ నటి ఫైర్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) ‘మా’ అనే హారర్ థ్రిల్లర్‌లో నటించింది.

హాట్ టాపిక్‌గా మారిన కాజోల్ వీడియో.. బాడీ షేమింగ్ చేయడానికి మీకెంత ధైర్యమంటూ నటి ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) ‘మా’ అనే హారర్ థ్రిల్లర్‌లో నటించింది. ఈ మూవీ జూన్ 27న విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా అత్యధిక వ్యూస్ రాబడుతూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ‘ది ట్రయల్-2’(The Trial-2) వెబ్ సిరీస్ చేస్తోంది. ఇందులో కాజోల్ నోయోనికా సేన్‌గుప్తాగా కనిపించనుంది. ఈ సిరీస్‌లో జిషు సేన్ గుప్తా ఆమె భర్తగా నటిస్తుండగా.. అలీ ఖాన్(Ali Khan), కుబ్రా సైట్, గౌరవ్ పాండే, కరణ్ వీర్ శర్మ, సోనాలి కులకర్ణి, షిబా చద్దా కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సీజన్-2 సెప్టెంబర్ 19 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ప్రమోషన్స్ మొదలెట్టిన కాజోల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ లాంచ్‌కు హాజర్ అయింది.

ఇక ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇందులో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ ధరించి అందరికీ చెమటలు పట్టించింది. ఆ డ్రెస్ టైట్‌గా ఉండటంతో బాడీ పార్ట్స్ క్లియర్‌గా కనిపిస్తున్నాయి. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాకుండా కాజోల్‌ ఫొటోలను జూమ్ చేసి చూసి మరీ బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక అది చూసిన నటి మిని మాథుర్ నెటిజన్లను తప్పు పట్టింది. అసలు ఆమె బాడీని జూమ్ చేయడానికి మీకెంత ధైర్యం.. తాను ఎలా కనిపించాలనేది తన ఇష్టం. ఎలా ఉండాలో అనేది మీరేలా డిసైడ్ చేస్తారంటే ఫైర్ అయింది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు ఆమె లేనీ బాధ నీకెందుకని రిప్లై ఇస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story