Kajol: ఆ సినిమాలు రిమేక్ చేయడం నాకు ఇష్టంలేదు: కాజోల్

by Disha Web Desk 10 |
Kajol: ఆ సినిమాలు రిమేక్ చేయడం నాకు ఇష్టంలేదు: కాజోల్
X

దిశ, సినిమా : గతంలో హిట్ అయిన సినిమాలను రిమేక్ చేయడంపై సీనియర్ నటి కాజోల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న నటి కెరీర్ అనుభవాలను పంచుకుంది. ఈ మేరకు ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి తాను ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు పోషించినందుకు హ్యీపీగా ఫీల్ అవుతానని చెప్పింది. అలాగే తన కెరీర్‌లో భారీ విజయం సాధించడంతోపాటు యువతను ఉర్రూతలూగించిన ‘దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’, ‘కభీ ఖుషీ కభీ గమ్’లు తన జీవితంలో మరుపురాని చిత్రాలుగా పేర్కొంది. ఈ క్రమంలోనే ఆ సినిమాలు రిమేక్ చేస్తే మళ్లీ నటిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానామిస్తూ.. ‘నా పర్సనల్ ఫీలింగ్.. ఆ రెండు సినిమాలను రీమేక్ చేయడం నాకు ఇష్టంలేదు. ఎందుకంటే అలాంటి చిత్రాలు ఓకేసారి మ్యాజిక్ చేయగలవు. రెండో పార్ట్‌లో మొదటిసారి పొందిన అనుభూతిని ప్రేక్షకులు ఆస్వాదించలేరు. అందుకే అభిమానులను నిరాశ పరచాలని నేను కోరుకోవట్లేదు’ అంటూ స్పష్టంగా చెప్పుకొచ్చింది.

Also Read: Shriya Saran: ఆ విషయంలో నా పిల్లలు గర్వంగా ఫీల్ అవ్వాలి: స్టార్ నటి

Next Story

Most Viewed